రైతు సేవా కేంద్రం వద్ద రైతుల ఆందోళన
ELR: ఏలూరు సుంకరవారితోటలో రైతు సేవా కేంద్రం వద్ద ఆపరాల రైతులు బుధవారం ఆందోళన చేపట్టారు. రైతు జిల్లా కార్యదర్శి శ్రీనివాస్ మాట్లాడుతూ... టార్గెట్ పూర్తయిందని గత కొన్ని రోజులుగా కొనుగోలు నిలిపివేయడంతో రైతులు పంటను కాపాడలేక తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారన్నారు. అధికారుల తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పెసర, మినుము పంటలను పూర్తిగా కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు.