నర్సాపూర్ తాగునీటి సమస్యపై మంత్రికి వినతి పత్రం
MDK: ఇటీవల భారీ వర్షాల వల్ల సింగూరు జలాలు విడుదల కావడంతో మంజీరా నదీ తీరంలో ప్రధాన పైప్‌లైన్ లీకై, మిషన్ భగీరథ ద్వారా నర్సాపూర్ నియోజకవర్గానికి తాగునీటి సరఫరా నిలిచిపోయింది. నియోజకవర్గ ఇంఛార్జి రాజిరెడ్డి హైదరాబాదులో జిల్లా ఇంఛార్జి మంత్రి వివేక్ వెంకటస్వామికి సమస్య తక్షణ పరిష్కారానికి శుక్రవారం వినతిపత్రం అందజేశారు.