VIDEO: రైతుల సమస్యలను కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లిన ఎమ్మెల్యే
కృష్ణా: తుఫాను విపత్తు సమీపిస్తున్న తరుణాన రైతాంగం అప్రమత్తంగా ఉంటూ తగు జాగ్రత్తలు తీసుకోవాలని ఎమ్మెల్యే వెనిగండ్ల రాము సూచించారు. గుడివాడ మండలం రామన్నపూడి గ్రామంలో 'రైతన్న మీకోసం' కార్యక్రమాన్ని కూటమి నేతలతో కలిసి ఆయన శనివారం నిర్వహించారు. రైతులు చెప్పిన సమస్యలపై ఎమ్మెల్యే రాము విని, కలెక్టర్ బాలాజీ, జేసీ నవీన్‌ల దృష్టికి ఫోన్ ద్వారా తీసుకెళ్లారు.