విద్యార్థుల సమస్యలను పరిష్కరించండి: SFI
కృష్ణా: గుడివాడలోని నలంద హైస్కూల్‌ను SFI జిల్లా కార్యదర్శి ఎస్.సమరం శనివారం సందర్శించారు. విద్యార్థుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం విద్యార్థులతో కలిసి మధ్యాహ్న భోజనం చేశారు. ప్రభుత్వ పాఠశాలల్లో సమస్యలు ఇంకా పరిష్కారం కావడం లేదని, ముఖ్యంగా మధ్యాహ్న భోజనం నాణ్యత అనుకున్న స్థాయిలో లేదని అన్నారు. పాఠశాలల్లో తాగునీటి సమస్య ఉందని తెలిపారు.