'పాఠశాల బలోపేతానికి ముందుకు రావాలి'
ADB: ప్రభుత్వ పాఠశాల బలోపేతానికి పలువురు యువకులు ముందుకు రావడం గొప్ప విషయమని పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు పద్మ అన్నారు. నేరడిగొండ ఉన్నత పాఠశాల 2002-03 విద్య సంవత్సరానికి చెందిన పూర్వ విద్యార్థులు తమ వంతు సహాయంగా విద్యార్థులకు క్రీడా దుస్తులను సోమవారం అందజేశారు. భవిష్యత్తులో పాఠశాలకు తమ వంతు సహాయంగా ఉంటామని అన్నారు.