గెలుపే ధ్యేయంగా పనిచేయండి: మంత్రి సవిత

గెలుపే ధ్యేయంగా పనిచేయండి: మంత్రి సవిత

సత్యసాయి: స్థానిక సంస్థ ఎన్నికల్లో గెలుపే ధ్యేయంగా ప్రతి ఒక్కరూ కృషి చేయాలని మంత్రి సవిత తెలిపారు. పెనుకొండలోని క్యాంపు కార్యాలయంలో నియోజవర్గంకు చెందిన క్లస్టర్, యూనిట్ ఇంఛార్జ్‌లతో మంత్రి సోమవారం సమావేశం నిర్వహించారు. ముఖ్యంగా పార్టీ కార్యకర్తలు, నాయకులు తమ విధులను శ్రద్ధగా నిర్వహించాలన్నారు. అనంతరం క్లస్టర్ యూనిట్ ఇంఛార్జ్‌లను ఘనంగా సన్మానించారు.