వాడపల్లిలో భక్తురాలికి అస్వస్థత

వాడపల్లిలో భక్తురాలికి అస్వస్థత

కోనసీమ: ఆత్రేయపురం మండలం వాడపల్లి వెంకటేశ్వర స్వామి వారి ఆలయంలో శనివారం ఉదయం ఒక భక్తురాలు అకస్మాత్తుగా స్పృహ కోల్పోయి పడిపోయింది. వెంటనే స్పందించిన డిప్యూటీ కమిషనర్ నల్లం సూర్య చక్రధరరావు ఆమెకు ప్రధమ చికిత్స అందించారు. అనంతరం పరిస్థితిని పరిశీలించి మెరుగైన వైద్య సేవల కోసం సమీప ఆసుపత్రికి తరలించారు.