VIDEO: వాడపల్లి వేంకన్నకు ఘనంగా చక్రస్నానం
కోనసీమ: ఆత్రేయపురం మండలం వాడపల్లి వేంకటేశ్వర స్వామి కళ్యాణోత్సవాల్లో భాగంగా గురువారం చక్రస్నానం కార్యక్రమం అత్యంత వైభవంగా జరిగింది. స్వామివారిని ఊరేగింపుగా గోదావరి నదికి తీసుకెళ్లి పవిత్ర జలాలతో స్నపన తిరుమంజనం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఛైర్మన్ వెంకటరాజు, ఈవో చక్రధరరావుతో పాటు పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. ఆలయ పరిసరాలు గోవింద నామస్మరణతో మారుమోగాయి.