పేదరిక నిర్మూలనపై అవగాహన సదస్సు

పేదరిక నిర్మూలనపై అవగాహన సదస్సు

VZM: సుప్రీంకోర్టు, హైకోర్టు ఆదేశాలతో పేదరిక నిర్మూలనపై నల్సా ఆధ్వర్యంలో కొత్తవలస వెలుగు కార్యాలయంలో శనివారం న్యాయ అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్బంగా జూనియర్ సివిల్ జడ్జి డా. ఎస్. విజయ్ చందర్ మాట్లాడుతూ.. పేదరికంలో పుట్టడం తప్పుకాదని, పేదరికంలో చనిపోకూడదని బిల్ క్లింటన్ అన్నారని గుర్తు చేశారు. కార్యక్రమంలో బార్ అసోసియేషన్ సభ్యులు దేవి, శ్రీను, మహేంద్ర పాల్గొన్నారు.