మామిడి రైతులకు కవర్లు పంపిణీ
CTR: మామిడి రైతులకు ప్రభుత్వం సబ్సిడీ ధరలతో అందిస్తున్న కవర్లను రైతులు సద్వినియోగం చేసుకోవాలని వ్యవసాయ మార్కెట్ కమిటీ ఛైర్మన్ శ్రీనివాసులు నాయుడు తెలిపారు. సోమలలో మంగళవారం సోమల, సదుం మండలాల మామిడి రైతులకు మామిడి కాయలకు తొడిగే కవర్లను పంపిణీ చేశారు. ఉద్యాన శాఖ అధికారిని సంతోషి కుమారి, టీడీపీ నాయకులు, కార్యకర్తలు, రైతులు సిబ్బంది పాల్గొన్నారు.