'డిసెంబర్ 10న మార్కేండేయ మాల ధారణ దీక్షలు ప్రారంభం'

'డిసెంబర్ 10న మార్కేండేయ మాల ధారణ దీక్షలు ప్రారంభం'

కరీంనగర్ జిల్లా హుజూరాబాద్‌లో డిసెంబర్ 10 నుంచి శ్రీ మార్కండేయ మాల ధారణ దీక్షలు ప్రారంభమవుతున్నాయని చేనేత సంఘం అధ్యక్షులు ఉపేందర్ తెలిపారు. మార్కండేయ స్వామి జన్మదినం రోజున దీక్ష విరమణ ఉంటుందని పేర్కొన్నారు. ఇదే రోజు రథయాత్రతో కార్యక్రమాల ముగింపు అవుతుందని ఆసక్తి గల భక్తులు మాల ధారణ దీక్షలు స్వీకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో పద్మశాలి నాయకులు పాల్గొన్నారు.