ప్రియురాలు మోసం చేసిందని యువకుడి సూసైడ్

ప్రియురాలు మోసం చేసిందని యువకుడి సూసైడ్

NLG: పదేళ్లు ప్రేమించిన యువతి మోసం చేసిందని ఓ యువకుడు సూసైడ్ చేసుకున్న ఘటన మిర్యాలగూడలో సోమవారం జరిగింది. స్థానికుల వివరాలు.. ఇందిరమ్మ కాలనీకి చెందిన కేశబోయిన కార్తిక్ (26) ఓ యువతిని ప్రేమించి రహస్యంగా పెళ్లి చేసుకున్నాడు. అయితే యువతి ఇటీవల వేరొకరితో నిశ్చితార్థం చేసుకోగా కార్తిక్ తీవ్ర మనోవేదనకు గురయ్యాడు. ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.