VIDEO: 'రోడ్డు మరమ్మత్తు పనులు చేపట్టాలి'

VIDEO: 'రోడ్డు మరమ్మత్తు పనులు చేపట్టాలి'

WGL: నర్సంపేట పట్టణ కేంద్రంలోని ఎంసీపీఐయూ పార్టీ ఆధ్వర్యంలో మాదన్నపేట రోడ్డు నిర్మాణ పనులు చేపట్టాలని రాస్తారోకో నిర్వహించారు. ఈ సందర్భంగా పార్టీ నాయకురాలు రాగసుధ మాట్లాడుతూ.. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు మాదన్నపేట రోడ్డు పూర్తిగా దెబ్బ తినడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బంది పడుతున్నరని అన్నారు. అధికారులు స్పందించి నిర్మాణ పనులు చేపట్టాల్సిందిగా కోరారు.