తేనె విక్రయాలు చేస్తూ బస్సుల్లో చోరీ.. మహిళ అరెస్ట్.!

ప్రకాశం: తేనె విక్రయాలు చేస్తూ బస్సులో ప్రయాణించే ప్రయాణికుల బ్యాగుల్లో చోరీలకు పాల్పడే మహిళను సోమవారం అరెస్టు చేసినట్లు ఒంగోలు వన్ టౌన్ సీఐ నాగరాజు, సీసీఎస్ సీఐ జగదీష్‌లు తెలిపారు. ఒంగోలులోని సీసీఎస్ పోలీస్ స్టేషన్ వద్ద వీరు మాట్లాడారు. నరసాపురంకు చెందిన మహిళ చోరీలకు అలవాటుపడి తన మకాం సింగరాయకొండకు మార్చిందన్నారు.