ఈ నెల 29న బాలుర క్రికెట్ జట్టు ఎంపిక పోటీలు
VZM: ఈ నెల 29న బాలుర అండర్-19 జిల్లా క్రికెట్ జుట్టు ఎంపిక పోటీలు నిర్వహిస్తున్నట్లు జిల్లా క్రికెట్ అసోసియేషన్ కార్యదర్శి పి.సీతారామరాజు గురువారం తెలిపారు. ఆయన మాట్లాడుతూ.. స్థానిక విజ్జీ మైదానంలో జరగబోయే ఈ పోటీలకు హాజరయ్యే క్రీడాకారులు 2007 సెప్టెంబర్ 1 తర్వాత పుట్టినవారై ఉండాలన్నారు. ఆసక్తి గల విద్యార్థులు ఉదయం 7 గంటలకే మైదానంలో ఉండాలన్నారు.