ఐలమ్మ పోరాట స్ఫూర్తిని ఆదర్శంగా తీసుకోవాలి: సీపీఎం

KMM: తెలంగాణ పోరాట యోధురాలు చాకలి ఐలమ్మ పోరాట స్ఫూర్తిని యువత ఆదర్శంగా తీసుకోవాలని సీపీఎం పార్టీ పిలుపునిచ్చింది. మధిర నందిగామ రోడ్డులోని ఐలమ్మ విగ్రహానికి సీపీఎం పార్టీ ఆధ్వర్యంలో పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా సీపీఎం కార్యదర్శి మడిపల్లి గోపాల్ రావు మాట్లాడుతూ..తెలంగాణ సాయుధ పోరాటంలో భూస్వాములకు వ్యతిరేకంగా ఐలమ్మ పోరాడారని కొనియాడారు.