గ్రంథాలయంలో 'చదవడం మాకు ఇష్టం' కార్యక్రమం
AKP: నర్సీపట్నం శాఖా గ్రంథాలయంలో గ్రంథాలయాధికారి పీ. దమయంతి ఆధ్వర్యంలో చదవడం మాకిష్టం కార్యక్రమాన్ని నిర్వహించారు. రిసోర్స్ పర్సన్ కావ్య పిల్లలకు జీకే ప్రశ్నలు వేసి జవాబులు రాబట్టారు. అనంతరం పిల్లల సందేహాలు నివృత్తి చేశారు. గ్రంధాలయాధికారి దమయంతి పిల్లలతో కథలు చదివించారు. విద్యార్థులు గ్రంథాలయాలను అలవాటు చేసుకోవాలన్నారు.