అభివృద్ధి పనులకు మంత్రి శంకుస్థాపన
W.G: పాలకొల్లు మండలం వడ్లవానిపాలెంలో రూ. 32 లక్షలతో నిర్మించే పంచాయతీ భవనానికి మంత్రి నిమ్మల రామానాయుడు ఇవాళ శంకుస్థాపన చేశారు. రూ. 15 లక్షలతో హిందు శ్మశాన వాటికలో మౌలిక వసతులను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ అంగర రామ్మోహన్, సాయి రాజు, ఎంపీపీ చిట్టూరి కనక మహాలక్ష్మి, కూటమి నేతలు పాల్గొన్నారు.