సమస్యలను త్వరగా పరిష్కరించాలి : ఎస్పీ
NGKL: జిల్లా ఎస్పీ పాటిల్ సంగ్రామ్ జీసింగ్ సోమవారం ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహించారు. జిల్లా వ్యాప్తంగా వచ్చిన ఫిర్యాదుదారుల సమస్యలను ప్రత్యక్షంగా విన్నారు. మొత్తం 14 ఫిర్యాదులను స్వీకరించగా, వాటిలో 11 భూమి సంబంధిత అర్జీలు ఉన్నాయి. చట్ట ప్రకారం సమస్యలను త్వరితగతిన పరిష్కరించాలని ఆయన సంబంధిత అధికారులకు సూచించారు.