మంత్రి సంధ్యరాణి రాజీనామా చేయాలి: మాజీ D.y సీఎం పుష్పశ్రీవాణి
PPM: ఏపీ గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సంధ్యరాణి వైఖరిపై మాజీ ఉపముఖ్యమంత్రి పుష్పశ్రీవాణి అసహనం వ్యక్తం చేశారు. గత ఐదు రోజులుగా మంత్రివైఖరిని గమనిస్తున్నానని, ఈ ధోరణితో వేధింపులకు గురైన మహిళకు న్యాయం జరుగుతుందనే నమ్మకం లేదన్నారు. పి.ఏ సతీష్‌పై వచ్చిన వేధింపు కేసులో బాధ్యతగా స్పందించకుండా అతడిని సమర్థించడం సిగ్గుచేటు అని ఆమె విమర్శించారు.