భూ భారతి సదస్సులో 1341 అర్జీలు

NRPT: భూ భారతి అమలుకు పైలెట్ ప్రాజెక్టు కింద ఎంపికైన మద్దూరు మండలంలో నిర్వహించిన సదస్సులో రైతుల నుండి 1341 అర్జీలు అందినట్లు కలెక్టర్ సిక్తా పట్నాయక్ అన్నారు. మంగళవారం నారాయణపేట కలెక్టరేట్‌లో అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. రైతుల నుండి అందిన అర్జీలను మే మొదటి వారంలోపు పరిష్కరిస్తామని అన్నారు. సమావేశంలో సంబంధిత అధికారులు పాల్గొన్నారు.