సంగం: ప్రాథమిక ఆరోగ్య కేంద్రం సందర్శన

సంగం: ప్రాథమిక ఆరోగ్య కేంద్రం సందర్శన

NLR: సంగం ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని మంగళవారం జిల్లా ఇంచార్జ్ డిఎంహెచ్‌వో షేక్ ఖాదర్ వల్లి సందర్శించారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలోని ఆశా కార్యకర్తలతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. అనంతరం ఆశా కార్యకర్తలకు యూనిఫాం పంపిణీ చేశారు. వేసవిలో ప్రజలకు వడదెబ్బ తగలకుండా గ్రామాల్లో ఓఆర్ఎస్‌లు అందుబాటులో ఉంచామన్నారు. ఈ కార్యక్రమంలో వైద్య సిబ్బంది పాల్గొన్నారు.