అధునాతన ఎండోస్కోపీ వ్యవస్థ ప్రారంభం
SS: పుట్టపర్తిలోని ప్రశాంతిగ్రామ్‌లో రూ. 2.45 కోట్ల విలువైన రెండు అధునాతన గ్యాస్ట్రోఎంటరాలజీ ఎండోస్కోపీ వ్యవస్థలను సత్యసాయి సెంట్రల్ ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ రత్నాకర్ ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ఈ అత్యాధునిక వ్యవస్థలు అధిక రిజల్యూషన్, నారో-బ్యాండ్ ఇమేజింగ్ (NBI) వంటి సాంకేతికతలతో ఖచ్చితమైన రోగ నిర్ధారణకు తోడ్పడతాయని తెలిపారు.