భైంసా రూరల్ సీఐగా నైలు బాధ్యతలు

భైంసా రూరల్ సీఐగా నైలు బాధ్యతలు

NRML: భైంసా రూరల్ నూతన సీఐగా నైలు బుధవారం బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా కుంటాల, భైంసా రూరల్ ఎస్సైలు స్వాగతం పలికి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా సీఐ మాట్లాడుతూ.. శాంతి భద్రతల విషయంలో రాజీ లేకుండా పనిచేస్తామన్నారు. అసాంఘిక కార్యకలాపాలపై ప్రత్యేక దృష్టిసారిస్తామన్నారు. మట్కా, పేకాట, ఇసుక అక్రమ రవాణాకు సంబంధించి ఎట్టి పరిస్థితుల్లోనూ రాజీపడేదిలేదన్నారు.