VIDEO: జూరాలకు పెరిగిన వరద ప్రవాహం

GDWL: జూరాల ప్రాజెక్ట్‌లోకి వరద ప్రవాహం మళ్లీ పెరిగింది. శుక్రవారం సాయంత్రానికి ఎగువ నుంచి 1,45,000 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో కొనసాగుతున్నట్లు ప్రాజెక్ట్ అధికారి వెంకటేశ్వర్లు తెలిపారు. దీంతో ప్రాజెక్ట్ 18 గేట్లు ఎత్తి 1,60,000 క్యూసెక్కుల నీటిని శ్రీశైలం జలాశయానికి విడుదల చేస్తున్నట్లు పేర్కొన్నారు. ప్రస్తుతం జూరాలలో 8.869 టీఎంసీల నీరు నిల్వ ఉందని ఆయన వెల్లడించారు.