హౌస్ లిస్టింగ్ బ్లాక్ క్రియేషన్ ఏర్పాట్లపై సమీక్ష
WNP: జన గణనలో భాగంగా చేపట్టిన హౌస్ లిస్టింగ్ బ్లాక్‌లను రూపొందించే ప్రక్రియను పారదర్శకంగా, పక్కాగా నిర్వహించాలని తెలంగాణ రాష్ట్ర సంచాలకులు భారతి అన్నారు. సోమవారం హైదరాబాద్ నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జిల్లా కలెక్టర్లతో సమీక్షించారు. మే 11వ తేదీ నుంచి నిర్వహించే ఇళ్ల గణన ప్రక్రియను ఎలాంటి పొరపాట్లకు తావు లేకుండా నిర్వహించాలన్నారు.