తమిళనాడులో భారీ వర్షాలు

తమిళనాడులో భారీ వర్షాలు

తమిళనాడులో భారీ వర్షాలు కురుస్తున్నాయి. చెన్నై, తిరువళ్లూరులో కుండపోత వానలు పడుతున్నాయి. భారీ వర్షాల కారణంగా చెన్నైలోని పలు ప్రాంతాలు నీటమునిగాయి. అలాగే ఆవడి, తిరుత్తణిలో కూడా పలు ప్రాంతాలు జలమయమయ్యాయి. దీంతో అప్రమత్తమైన అధికారులు లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు.