మరుపల్లిలో అదనపు తరగతి భవనం ప్రారంభించిన మంత్రి
VZM: గజపతినగరం మండలంలోని మరుపల్లి గ్రామంలో గల కస్తూరిబా గాంధీ విద్యాలయంలో నూతనంగా నిర్మించిన అదనపు తరగతుల భవనాన్ని శనివారం మంత్రి శ్రీనివాస్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కూటమి ప్రభుత్వం విద్యారంగానికి అధిక ప్రాధాన్యత ఇస్తున్నట్లు చెప్పారు. అలాగే హైస్కూల్లో లాబరేటరీని ప్రారంభించారు. శ్రీనివాసులనాయుడు, శ్రీదేవి పాల్గొన్నారు.