ప్రభుత్వ పాఠశాలను తనిఖీ చేసిన అదనపు కలెక్టర్

ప్రభుత్వ పాఠశాలను తనిఖీ చేసిన అదనపు కలెక్టర్

మేడ్చల్: విద్యార్థులు వ్యక్తిగత పరిశుభ్రతతో పాటు, పరిసరాల పరిశుభ్రతను పాటించాలని జిల్లా అదనపు కలెక్టర్ రాధిక గుప్తా అన్నారు. మంగళవారం కీసర మండలం అంకిరెడ్డిపల్లిలో ఉప్పల్, కుత్బుల్లాపూర్‌లకు నిర్వహిస్తున్న మహాత్మ జ్యోతిబాపూలే తెలంగాణ బీసీ వెల్పేర్ రెసిడెన్షియల్ స్కూల్, జూనియర్ కాలేజీని ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా వంట గది, స్టోర్‌ రూమ్‌ను పరిశీలించారు.