కొండచిలువలపై రోబో ట్రాప్
USలోని ఫ్లోరిడాలో బర్మీస్ పైథాన్ అనే భారీ కొండచిలువల బెడద రోజురోజుకీ పెరుగుతోంది. ఇవి కుందేళ్లను తినేందుకు ఎంతో ఇష్టపడతాయని తెలుసుకున్న అక్కడి ప్రభుత్వం.. సోలార్‌తో పనిచేసే రోబో కుందేళ్లను అడవుల్లోకి వదులుతోంది. ఈ రోబోలలో అమర్చిన కెమెరాలు కొండచిలువలు దగ్గరకు రాగానే వాటిని గుర్తించి అధికారులకు సమాచారమిస్తాయి. దీంతో అధికారులు వాటిని పట్టుకుని అడవులకు తరలిస్తున్నారు.