గురుకుల ప్రవేశాలకు మార్చి 31 చివర తేది

SKLM: 5,6,7,8 తరగతుల్లో మిగిలి ఉన్న ఖాళీల ప్రవేశాలకు విద్వార్థులు దరఖాస్తు చేసుకోవాలని గార మండలం వమరవల్లి గురుకుల విద్యాలయం ప్రధానోపాధ్యాయురాలు వై.చిట్టితల్లి శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. గురుకులాల్లో చేరే విద్యార్థులు ఈ నెల 31 లోగా ఆన్లైన్ లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. గురుకుల ప్రవేశ పరీక్ష ఏప్రిల్ 25వ తేదీన నిర్వహించనున్నట్లు తెలిపారు.