ఘోర ప్రమాదం.. ముగ్గురు స్పాట్‌డెడ్
AP: చిత్తూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. గంగాధర నెల్లూరు మండలం ఎట్టేరి గ్రామం వద్ద స్కూటర్‌ను ఆర్టీసీ బస్సు ఢీకొట్టింది. ఈ ఘటనలో స్కూటర్‌పై వెళ్తున్న ముగ్గురు స్పాట్‌లోనే మృతి చెందారు. మృతులు ఒకే కుటుంబానికి చెందిన వారిగా గుర్తించారు. ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.