రంజాన్ తోఫా కిట్లను పంపిణీ చేసిన ఎమ్మెల్యే

రంజాన్ తోఫా కిట్లను పంపిణీ చేసిన ఎమ్మెల్యే

NTR: విజయవాడ వాంబే కాలనీ వీఎంసీ కళ్యాణ మండపంలో కార్పొరేటర్ కంచి దుర్గా 800 మంది కుటుంబాలకు ఏర్పాటు చేసిన రంజాన్ తోఫా కిట్లను ఎమ్మెల్యే బోండా ఉమా గురువారం పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పేద ప్రజలకు ఎంతగానో ఉపయోగపడే సేవా కార్యక్రమాలు చేస్తున్న కార్పొరేటర్ దుర్గాను అభినందించారు. ఈ కార్యక్రమంలో కూటమి నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు.