విజయవంతగా మండల స్థాయి షటిల్ బాడ్మింటన్ పోటీలు
కోనసీమ: రాజోలు మండలంలోని బి.సావరం కోరుకొండాస్ ఇండోర్ బాడ్మింటన్ స్టేడియంలో గురువారం మండల స్థాయి షటిల్ బాడ్మింటన్ పోటీలు నిర్వహించారు. స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ అఫ్ ఇండియా నిర్వహించే అండర్ 14-17 బాలురు, బాలికల జాతీయ క్రీడా షటిల్ పోటీలలో భాగంగా ఈ పోటీలు నిర్వహించామని ఎంఈవో నల్లి మనోహరం తెలిపారు. మండలంలోని 9 ఉన్నత పాఠశాలలో చదువుతున్న విద్యార్థులు పాల్గొన్నారు.