మంత్రి చొరవతో మంథని ఆసుపత్రిలో డాక్టర్ల నియామకం

PDPL: మంథని ప్రభుత్వాసుపత్రి సౌకర్యాల విస్తరణకు మంత్రి శ్రీధర్ బాబు ప్రత్యేక చొరవ చూపారు. రూ. 20 లక్షల నిధులు కేటాయించారు. ఇద్దరు కొత్త డాక్టర్ల నియామకం, రూ. 5లక్షలతో వెయిటింగ్ హాల్, రూ. 12లక్షలతో అల్ట్రాసౌండ్ స్కానింగ్, రూ. 1.12 లక్షలతో వార్మర్-ఫొటోథెరపీ, రూ. 1.80 లక్షలతో 2 RO ప్లాంట్లను ఏర్పాటు చేయనున్నారు. త్వరలో మంత్రి చేతుల మీదుగా ప్రారంభమైతాయన్నారు.