పొన్కల్ సదర్మాట్ బ్యారేజ్‌లో మొసళ్లు

పొన్కల్ సదర్మాట్ బ్యారేజ్‌లో మొసళ్లు

NRML: మామడ మండలం పొన్కల్ గ్రామ సమీపంలో నిర్మించిన సదర్మాట్ బ్యారేజ్ వద్ద గోదావరి నదిలో మొసళ్లు తిరుగుతున్నాయి. ప్రాజెక్ట్ 55 గేట్లు ముసివేయడంతో గోదావరి ముంపునకు గురైన నాగదేవత, హనుమాన్ ఆలయాల వద్ద గురువారం మొసళ్లు కనిపించాయి. దీంతో ప్రజలు భయబ్రాంతులకు గురవుతున్నారు. గ్రామస్థులు అటువైపు వెళ్లవద్దని, మత్స్యకారులు జాగ్రత్తగా ఉండాలని అధికారులు సూచించారు.