హత్య మిస్టరీ ఇంకా వీడలేదు

మేడ్చల్: కూకట్‌పల్లిలో పదేళ్ల బాలిక సహస్ర దారుణ హత్య మిస్టరీ వీడలేదు. జీప్లస్2 భవనంలో నివసిస్తున్నవారే హత్యకు పాల్పడి ఉంటారని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. నలుగురు అనుమానితుల్ని విచారించినా పురోగతి లేదు. సాంకేతిక ఆధారాలతో దర్యాప్తు కొనసాగుతోంది.