నేడు విద్యుత్ సరఫరాలో అంతరాయం

నేడు విద్యుత్ సరఫరాలో అంతరాయం

NTR: తిరువూరు 11 KV టౌన్ ఫీడర్‌లో మరమ్మతుల కారణంగా బుధవారం ఉదయం 8:30 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు విద్యుత్ సరఫరాలో అంతరాయం ఉంటుందని ఏఈ కృష్ణారెడ్డి తెలిపారు. ఈ కారణంగా కుమ్మరి బజార్, గవర్నమెంట్ జూనియర్ కాలేజ్, బోసుబొమ్మ సెంటర్, ప్రభుత్వ ఆసుపత్రి నుంచి ఫైర్ స్టేషన్ వరకు కరెంటు నిలిచిపోనుంది. ఈ విషయాన్ని వినియోగదారులు గమనించి,  సహకరించాలని ఏఈ కోరారు.