'గ్రామాల్లో నెలకొన్న సమస్యలపై దృష్టి సారించండి'

KDP: గ్రామాల్లో నెలకొన్న సమస్యలపై ప్రత్యేక దృష్టి సారించాలని ఎంపీపీ వరలక్ష్మి అధికారులకు సూచించారు. బుధవారం పులివెందులలోని ఎంపీడీవో కార్యాలయ సభా భవనంలో ఎంపీడీవో రామాంజనేయరెడ్డి అధ్యక్షతన మండల సర్వసభ్య సమావేశం నిర్వహించారు. అందులో భాగంగా ఆమె మాట్లడుతూ.. గ్రామాల్లో తాగునీరు, వీధిలైట్ల సమస్యలు లేకుండా చర్యలు తీసుకోవాలన్నారు.