గుర్తు తెలియని టూ వీలర్ వాహనం కలకలం
కర్నూలు: ఆదోని ఇంద్రానగర్ కాలనీ చివర్లో రెండు రోజులుగా ఓ టూ వీలర్ అనుమానాస్పదంగా నిలిచి ఉండడంతో స్థానికుల్లో ఆందోళన చోటుచేసుకుంది. గుర్తు తెలియని వ్యక్తులు వదిలేసి వెళ్లిన వాహనంపై సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని పరిశీలించారు. బైక్ వివరాలు, యజమాని గుర్తింపు కోసం పోలీసులు దర్యాప్తు చేస్తామన్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.