'గ్రామీణ ప్రాంతాల అభివృద్ధే కూటమి ప్రభుత్వ లక్ష్యం'

'గ్రామీణ ప్రాంతాల అభివృద్ధే కూటమి ప్రభుత్వ లక్ష్యం'

అన్నమయ్య: గ్రామీణ ప్రాంతాల అభివృద్ధే ధ్యేయంగా ప్రభుత్వం పనిచేస్తోందని రాష్ట్ర యువజన క్రీడల శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి అన్నారు. రాయచోటి మండలం చెన్నమక్కపల్లి-కొలిమిట్ట మధ్య 600 మీటర్ల సీసీ రోడ్డు నిర్మాణానికి రూ.25 లక్షల వ్యయంతో ఆయన భూమి పూజ నిర్వహించారు. మారుమూల పల్లెల్లో మౌలిక సదుపాయాల కల్పనకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని ఈ సందర్భంగా మంత్రి పేర్కొన్నారు.