నేడు టెక్కలి ఆస్పత్రి సలహా సంఘ సమావేశం

SKLM: జిల్లా ప్రభుత్వ ఆస్పత్రి సలహా సంఘం సమావేశం బుధవారం నిర్వహిస్తున్నట్లు సూపరిండెంట్ డాక్టర్ బొడ్డేపల్లి సూర్యరావు ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సమావేశానికి ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు, జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్, ఆర్డీవో ఎం. కృష్ణమూర్తి తదితరులు పాల్గొంటారని తెలిపారు.