చరిత్రలో ఈ రోజు జిల్లా ప్రాముఖ్యత.!
PLD: నాటి ఏపీ ప్రభుత్వం ఏప్రిల్ 4 (2022) ఇదే రోజున గుంటూరు జిల్లాను విభజించి, పల్నాడు జిల్లాను అధికారికంగా ఏర్పాటు చేసింది. నరసరావుపేటను జిల్లా కేంద్రంగా చేసి, గురజాల, సత్తెనపల్లి, నరసరావుపేట రెవెన్యూ డివిజన్లను కలిపి ఈ కొత్త జిల్లా ఏర్పడింది. ఇది రాష్ట్రంలో జిల్లాల పునర్వ్యవస్థీకరణలో భాగం. గతంలో ఈ ప్రాంతం పల్లవనాడుగా ప్రసిద్ధి చెందిన చారిత్రక ప్రాంతం.