'కె-ర్యాంప్' సక్సెస్ మీట్
కిరణ్ అబ్బవరం హీరోగా, జైన్స్ నాని తెరకెక్కించిన 'కె-ర్యాంప్' చిత్రం మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. దీంతో చిత్ర బృందం ఇవాళ హైదరాబాద్‌లోని హోటల్ దస్‌పల్లాలో సక్సెస్ మీట్‌ను ఏర్పాటు చేసింది. ఈ కార్యక్రమం సాయంత్రం 6 గంటలకు మొదలవుతుంది. ఈ వేడుకకు హీరో, హీరోయిన్‌లతో పాటు చిత్ర యూనిట్‌లోని ముఖ్య సభ్యులందరూ హాజరుకానున్నారు.