జాతీయ స్థాయిలో మెరిసిన ప్రణవి బుర్రి
NTR: నూజివీడుకు చెందిన ప్రణవి బుర్రి క్రీడా రంగంలో మరో మైలురాయిని సృష్టించింది. ఇటీవల 26వ తేదీ నుంచి 28 వరకు విజయవాడ మేరీస్ స్టెల్లా కళాశాలలో జరిగిన అండర్-19 టోర్నమెంట్‌లో తూర్పుగోదావరి జట్టుతో జరిగిన ఫైనల్లో విజయం సాధించి ప్రథమ స్థానం దక్కించుకుంది. క్రీడా రంగంలో అద్భుతంగా రాణిస్తున్న ప్రణవికి స్థానికుల నుంచి అభినందనలు వెల్లువెత్తుతున్నాయి.