దేవాలయ భూముల పేరుతో పేదలను ఆగం చేయొద్దు: ఈటల

దేవాలయ భూముల పేరుతో పేదలను ఆగం చేయొద్దు: ఈటల

RR: కర్మన్ ఘాట్‌ శ్రీ బన్సురీవాలా కృష్ణ దేవాలయానికి చెందిన భూముల్లో 35 ఏళ్లుగా నివసిస్తున్న నిరుపేదలను అకస్మాత్తుగా ఖాళీ చేయించడం ఘోర అన్యాయమని ఎంపీ ఈటల రాజేందర్ అన్నారు. నిజంగా అవి, ఎండోమెంట్ భూములైతే ఇన్నాళ్లూ అధికారులు ఎందుకు చర్యలు తీసుకోలేదని ప్రశ్నించారు. ఇళ్ల నిర్మాణానికి అనుమతులు ఎలా ఇచ్చారు? ఇంటి పన్నులు ఎలా వసూలు చేశారో స్పష్టత ఇవ్వాలన్నారు.