ఎన్నికల బందోబస్తుకు 877 మంది పోలీసు సిబ్బంది

ఎన్నికల బందోబస్తుకు 877 మంది పోలీసు సిబ్బంది

కరీంనగర్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో గ్రామ పంచాయతీ ఎన్నికల బందోబస్తు కోసం దాదాపు 877 మంది పోలీసు సిబ్బందిని వినియోగిస్తున్నట్లు సీపీ గౌస్ ఆలం తెలిపారు. ఇందులో ఆరుగురు ఏసీపీలు, 20 ఇన్‌స్పెక్టర్లు, 39 ఎస్సైలు, 40 ఏఎస్సైలు/హెడ్ కానిస్టేబుల్స్, 460 కానిస్టేబుళ్లు, 35 స్పెషల్ యాక్షన్ టీమ్ పోలీసులు, 178 హోంగార్డులు, 100 మంది బెటాలియన్ స్పెషల్ పోలీసులను సిద్దం చేశారు.