రాధాకృష్ణపై వైసీపీ మహిళా నాయకులు ఫిర్యాదు
PLD: సత్తెనపల్లి నియోజకవర్గ సమన్వయకర్త డాక్టర్ గజ్జల సుధీర్ భార్గవ రెడ్డి, వైసీపీ మహిళా నాయకులతో కలిసి గురువారం సత్తెనపల్లి పోలీస్ స్టేషన్‌లో ABN ఎండీ రాధాకృష్ణపై ఫిర్యాదు చేశారు. ఆయన చేసిన వ్యాఖ్యలు మహిళలను అవమానించేలా ఉన్నాయని, వాటిపై వెంటనే చర్యలు తీసుకుని, కేసులు నమోదు చేయాలని డిమాండ్ చేశారు.