VIDEO: 'తెలంగాణ కళాకారుల పాటలతో వచ్చింది'
HYD: బషీర్ బాగ్ ప్రెస్ క్లబ్‌లో తెలంగాణ కళాకారుల సంఘం ఆధ్వర్యంలో 'ధూమ్ ధామ్' కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంపీ ఆర్.కృష్ణయ్య మాట్లాడుతూ.. 'తెలంగాణ రాష్ట్రం మాజీ సీఎం KCR వల్ల రాలేదు. కళాకారుల పాటలతో వచ్చింది. ఒక్క పాట వంద ఉపన్యాసాలతో సమానం. అలాంటి కళాకారులు ఉద్యోగాల కోసం ఇంకా ఉద్యమాలు చేయడం బాధాకరం. దీనిపై సీఎం రేవంత్ రెడ్డి దృష్టి సారించాలి' అని పేర్కొన్నారు.