VOAలకు స్మార్ట్ ఫోన్లు పంపిణీ చేసిన కలెక్టర్

VOAలకు స్మార్ట్ ఫోన్లు పంపిణీ చేసిన కలెక్టర్

KRNL: జిల్లాలోని 908 మంది విలేజ్ ఆర్గనైజేషన్ అసిస్టెంట్స్ (VOAs)కు గురువారం 5G స్మార్ట్ ఫోన్‌లను కలెక్టర్ డా.ఏ.సిరి పంపిణీ చేశారు. స్వయం సహాయక సంఘాల కార్యకలాపాలు మరింత సమర్థవంతంగా నిర్వహించేందుకు, ఆర్థిక లావాదేవీలను ఆన్‌లైన్‌లో నమోదు చేయడంలో ఈ ఫోన్లు ఉపయోగపడతాయని పేర్కొన్నారు. గ్రామీణ మహిళా సంఘాల అభివృద్ధికి ఇవి దోహదపడతాయని చెప్పుకొచ్చారు.